Header Banner

మహిళలకు ఉచిత బస్సు పథకానికి ముహూర్తం ఫిక్స్! ఎప్పటి నుండి అంటే?

  Sun May 18, 2025 06:48        Politics

ఏపీలో కూటమి పార్టీల ఎన్నికల హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించే పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ఇవాళ ప్రకటించారు. ఆగస్టు 15న లాంఛనంగా ఈ పథకం అమలు ప్రారంభించబోతున్నట్లు ఇవాళ చంద్రబాబు కర్నూల్లో తెలిపారు. దీంతో కూటమి సర్కార్ మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్నట్లు అవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కేబినెట్ మంత్రులు ఈ ప్రకటనపై స్పందించారు.

 

ఉచిత బస్సు ప్రయాణ ప్రకటనపై సీఎం చంద్రబాబుకు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.సామాన్య ప్రజల కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చొరవ అభినందనీయం అన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో ప్రజలకు భారీ ఊరట కలుగుతుందన్నారు. చంద్రబాబు ప్రజా సంకల్పమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం అని మంత్రి తెలిపారు. మహిళలకు, వృద్ధులకు ప్రయాణంలో భద్రత, స్వేచ్ఛను కలిగించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

 

గ్రామాల నుంచి పట్టణాలకు వడివడిగా ప్రయాణించే మహిళలకు ఇది వరమని మంత్రి మండిపల్లి తెలిపారు. ఇది కేవలం ఓ నిర్ణయం కాదని, ప్రజల పట్ల సీఎం హృదయాన్ని చూపిస్తోందన్నారు. ఉచిత బస్సు పథకంతో కుటుంబ ఆర్థిక భారం తగ్గిందన్నారు. టీడీపీ ప్రభుత్వం సామాజిక న్యాయం, సౌకర్యాల పాలనకు సంకేతం ఇదే అన్నారు. మహిళా సాధికారతకు చంద్రబాబు బలమైన అడుగుగా దీన్ని ఆయన అభివర్ణించారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్! చంద్రబాబు కీలక ఆదేశాలు! రూ.12,500 చొప్పున..

 

మరోవైపు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా చంద్రబాబు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ముహుర్తం ప్రకటించడాన్ని స్వాగతించారు. ఇచ్చిన మాట పైన నిలబడే నిజమైన నాయకుడు చంద్రబాబు అన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రకటించడం సంతోషకరం అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సూపర్ సిక్స్ పథకాలన్నిటిని అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

 

వచ్చే నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయబోతున్నామని మంత్రి అనగాని తెలిపారు.మెగా డీఎస్సీ ద్వారా 16 వేల పైగా టీచర్ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు గుర్తుచేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే 20 లక్షల మందికి ఉపాధి కల్పించే విషయమై భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని మరోసారి రుజువైందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధితోపాటు సంక్షేమం ముందుకు సాగుతున్నాయన్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #FreeBusForWomen #APGovernment #ChandrababuNaidu #WomenEmpowerment #APSRTC #PublicTransport #August15Launch